News September 6, 2024

ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే సన్మానం

image

జిల్లా కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. సోమిరెడ్డి మాట్లాడుతూ.. గురువులు దైవ సమానులని, ఉత్తమ ఉపాధ్యాయులను తన చేతులు మీద సన్మానించడం చాలా సంతోషకరమని అన్నారు.

Similar News

News January 14, 2025

నెల్లూరు: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

image

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందిన ఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాచలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇందుకూరుపేట(M), లేబూరుకు చెందిన కాలేషా(45), అతని కొడుకు హమీద్(12) మృతి చెందారు. మనుబోలులో జరిగిన రోడ్డుప్రమాదంలో సైదాపురం(M), గంగదేవిపల్లికి చెందిన సుబ్బయ్య(34), శంకరయ్య(39)దుర్మరణం చెందారు. గుడ్లూరులో జరిగి రోడ్డుప్రమాదంలో రాపూరుకు చెందిన వెంకటేశ్వర్లు(60), హార్దిక రాజ్(4) మరణించారు.

News January 14, 2025

సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వానం

image

సీఎం చంద్రబాబును సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ నారావారిపల్లిలో కలిశారు. ఈ మేరకు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

News January 14, 2025

సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వానం

image

సీఎం చంద్రబాబును సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ నారావారిపల్లిలో కలిశారు. ఈ మేరకు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.