News September 24, 2024

ఉత్తరాంధ్ర రైల్వే డివిజన్ ఛైర్మన్‌గా కేంద్రమంత్రి

image

విశాఖపట్నంలో జరిగిన రైల్వే వాల్తేర్ డీఆర్ఎం సమావేశంలో ఉత్తరాంధ్ర రైల్వే అభివృద్ధి పనులపై చర్చించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం-సికింద్రాబాద్ తిరుపతికి కొత్త రైళ్లను, రోజువారి ప్రయాణికుల కోసం శ్రీకాకుళం-విశాఖను కలిపే నమో-భారత్ సర్వీసును ప్రారంభించాలని అధికారులను కేంద్రమంత్రి కోరారు. డివిజన్ ఛైర్మన్‌గా ఎంపిక చేసినందకుకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News September 29, 2024

దూసి: గాంధీ పర్యటించిన రైల్వే స్టేషన్‌లో స్థూపం ఏర్పాటు

image

దూసి రైల్వే స్టేషన్‌లో మహాత్మ గాంధీ స్మారక స్థలి ఏర్పాటు చేసేందుకు విశాఖ ఇంటాక్ట్ సంస్థ ప్రతినిధులు సిద్థంగా ఉన్నారని తెలిపారు. ఆ విషయమై పరిశీలించడానికి వచ్చామని సీనియర్ డీసీఎం ఈస్ట్ కోస్ట్ వాల్తేరు డివిజన్ అధికారి పవన్ కుమార్ అన్నారు. శనివారం ఉదయం దూసి రైల్వే స్టేషన్‌ను పలువురు అధికారులతో కలిసి సందర్శించి మహాత్మ గాంధీ పర్యటించిన ప్రదేశాన్ని పరిశీలించారు. దూసి రైల్వే స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

News September 29, 2024

అట్రాసిటీ చట్టం పగడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్ దినకరన్

image

SC, ST అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకరన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం పై నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మహేశ్వర రెడ్డితో కలిసి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులను పరిష్కరించాలని చెప్పారు. కమిటీలోని 8 మంది నూతన సభ్యుల నియామకానికి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.

News September 28, 2024

జాతీయస్థాయి హాకీ పోటీలకు సిక్కోలు క్రీడాకారిణి

image

శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస గ్రామానికి చెందిన చింతాడ చిన్ని జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 10 వరకు ఝార్ఖండ్ రాష్ట్రం రాంచి పట్టణంలో జరగనున్న 14వ హాకీ ఇండియా జూనియర్ మహిళా జాతీయ స్థాయి పోటీలకు ఏపీ తరపున పాల్గొంటానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందిస్తున్నారు.