News November 1, 2024

‘ఉత్తరాంధ్రలో 210 శివాలయాలు’

image

ఈ నెల 2 నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గల శివాలయాల్లో భక్తుల దర్శనానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు దేవదాయ శాఖ ఉప కమిషనర్ సుజాత తెలిపారు. విశాఖ తన కార్యాలయంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 210 శివాలయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కార్తీక సోమవారాల్లో శివాలయాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ, తాగునీరు మజ్జిగ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 1, 2024

విశాఖలో క్రైమ్ ఎస్ఐను సస్పెండ్ చేసిన సీపీ

image

ఎంవీపీ కాలనీ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి క్రైమ్ ఎస్ఐ ఎన్.జగదీశ్‌ను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ సస్పెండ్ చేశారు. ఇదే సంఘటనపై ద్వారక క్రైమ్ సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ డి.బంగారుపాపపై శాఖపరమైన చర్యలకు మేజర్ పీఆర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు 79950 95799 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సీపీ పేర్కొన్నారు. కాగా.. ఇటీవల ఇద్దరు ట్రాఫిక్ ఎస్ఐలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

News November 1, 2024

విశాఖ-విజయవాడ మధ్య జన్ సాధారణ్ రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. విశాఖ- విజయవాడ-విశాఖ మధ్య జన్ సాధారణ్ రైళ్లను(అన్ రిజర్వుడు) శుక్రవారం నుంచి నడుపుతున్నారు. విశాఖ -విజయవాడ-విశాఖ మధ్య 1,3,4,6,8,10,11,13 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం, స్టేషన్ల మీదుగా నడుస్తాయన్నారు.

News November 1, 2024

పోయిన పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి: గంటా

image

గత ప్రభుత్వ హయాంలో కుదేలైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు జెట్ స్పీడ్‌లో అభివృద్ధి దిశగా తీసుకు వెళుతున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఎంవీపీ కాలనీ తన నివాసంలో మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్‌కు వచ్చే నెలలో శంకుస్థాపన జరగనున్నదని వెల్లడించారు. రూ.75 వేల కోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరాన్ని రెండేళ్లలో పూర్తిచేసేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందించారన్నారు.