News April 4, 2025
ఉపాధి హామీ పథకంలో కోనసీమ ఫస్ట్: కలెక్టర్

ఉపాధి హామీ పథకం ద్వారా కోనసీమ జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1.74 లక్షల ఉపాధి వేతనదారులకు పని కల్పించామని కలెక్టర్ మహేష్‌కుమార్ గురువారం తెలిపారు. 57 లక్షల పనిదినాల లక్ష్యానికి గాను 56.80 లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించిందని తెలిపారు. రోజువారీ సగటు వేతనం రూ.291.20 చెల్లించామన్నారు. కూలీలకు వేతనాల కింద రూ. 165.43 కోట్లు ఖర్చు చేశామన్నారు.
Similar News
News April 12, 2025
నరసరావుపేట: ఎస్పీ కంచి శ్రీనివాసరావు కీలక సూచన

పల్నాడు జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో ఈనెల 14న సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా సోమవారం జరిగే ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలన్నారు.
News April 12, 2025
55,418 పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం

TG: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 55,418 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. గత 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 58,868 పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు 55,418 ఉద్యోగాలను భర్తీ చేస్తే ఈ సంఖ్య 1.14 లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగాల భర్తీలో రికార్డు సృష్టించినట్లు అవుతుందని అన్నారు.
News April 12, 2025
పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ముగ్గురు కోనసీమ నేతలు

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీని శనివారం పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. నూతన కమిటీలో కోనసీమ జిల్లాకు ప్రాధాన్యం కల్పించారు. ఈ జిల్లాకు చెందిన ముగ్గురికి స్థానం కల్పించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు, పినిపె విశ్వరూప్ కు అవకాశం కల్పించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.