News February 25, 2025
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని, అందుకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, తహశీల్దార్లకు రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News February 25, 2025
వరంగల్: శైవ క్షేత్రాలకు నేటి నుంచి స్పెషల్ బస్సులు

మహా శివరాత్రి సందర్భంగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది. నేటి నుంచి ఈనెల 27వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్-1, వరంగల్-2, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, పరకాల, హనుమకొండ డిపోల నుంచి 255 బస్సులను నడపనున్నారు. ఆయా డిపోల నుంచి కాళేశ్వరం, పాలకుర్తి, కురవి, కొమురవెల్లి, రామప్ప, మెట్టుగుట్టకు నడిపెంచేలా ఏర్పాట్లు చేశారు.
News February 25, 2025
పెదమేరంగిలో ఏనుగుల గుంపు బీభత్సం

జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ షట్టర్లను విరగగొట్టి లోపలకి చొరబడి ధాన్యం, బియ్యం నిల్వలను చెల్లాచెదురుగా చేశాయి. నెల రోజుల్లో 2 సార్లు ఇదే మిల్‌పై దాడి చేయడంతో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వచ్చిందని బాధితులు వాపోతున్నారు.
News February 25, 2025
గుంటూరులో లారీ ఢీకొని ఇద్దరు మృతి

గోరంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో లారీ ఢీ కొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అమరావతి నుంచి గుంటూరు నగరంలోకి వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందియ. స్థానికుల సమాచారంతో నల్లపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుల్లో ఒక మహిళ, పురుషుడు ఉన్నారు.