News March 4, 2025
ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉండటంవల్లే ఓడిపోయాను: రఘువర్మ

ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉండటం వల్లే ఓడిపోయానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ అన్నారు. ఆరేళ్ల నుంచి ఉపాధ్యాయుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానన్నారు. గత ఎన్నికల్లో యూటీఎఫ్‌తో కలిసి పోటీ చేసి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. ఈసారి విడివిడిగా పోటీ చేయడం కూడా ఓటమికి ఒక కారణం అన్నారు. ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉందని అది తనమీద కాదన్నారు.
Similar News
News December 17, 2025
రేపే మార్గశిర మాస శివరాత్రి.. మోక్షం కోసం ఏం చేయాలంటే?

మాస శివరాత్రి రోజున సూర్యోదయం లోపు స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజకు ముందు వరకు ఉపవాసం ఉండాలి. శివుడికి పూలు, పండ్లు, బిల్వపత్రాలు, పెరుగు, గంగాజలం సమర్పించాలి. సాయంత్రం గుడిలో/ఇంట్లో శివాభిషేకం చేసి, దీపం వెలిగించాలి. ‘ఓం నమః శివాయ’ వంటి శివ మంత్రాలు జపించాలి. మాస శివరాత్రి కథ విని, చివరగా హారతి ఇవ్వాలి. సిరిసంపదల కోసం లక్ష్మీ నరసింహ సహస్రనామ పారాయణం కూడా చేయవచ్చు.
News December 17, 2025
త్వరలో కొత్త సర్పంచులతో సీఎం సమావేశం

TG: కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన కొత్త సర్పంచులతో CM రేవంత్ భేటీ కానున్నారు. ఇవాళ తుది విడత పంచాయతీ ఎన్నికలు జరగనుండగా ఈ నెల 20న సర్పంచుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ తర్వాత HYDలో సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని CM నిర్ణయించారు. సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం, సంస్థాగతంగా కాంగ్రెస్ క్యాడర్‌ను బలోపేతం చేయడంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
News December 17, 2025
పొలం గట్లపై బంతి మొక్కలను పెంచితే?

పొలం గట్లపై బంతి మొక్కలను పెంచడం వల్ల అనేక లాభాలున్నాయి. బంతి పువ్వులు బయట నుంచి వచ్చే హానికర పురుగులను ఆకర్షించి.. గట్టు పక్కన ఉన్న ప్రధాన పంటకు చీడల ముప్పును తగ్గిస్తాయి. బంతి పూలు తేనెటీగలు, ఇతర కీటకాలను ఆకర్షించడం వల్ల పరాగ సంపర్కం జరిగి పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఈ పువ్వులను మన సొంత అవసరాలకు వాడుకోవచ్చు, అలాగే ఎక్కువ పూలు వస్తే అమ్మి కొంత మొత్తం ఆదాయంగా పొందవచ్చు.


