News February 12, 2025
ఉప్పలగుప్తం: ఉద్యోగాల ఇప్పిస్తానని టోకరా

ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసగించిన కేసులో ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన జంపన గణేశ్ రాజుకి జైలు శిక్ష పడింది. ముద్దాయికి ముమ్మిడివరం జెఎఫ్‌సీఎం కోర్టు మెజిస్ట్రేట్ మహమ్మద్ రహంతుల్లా రెండేళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించినట్లు ఎస్ఐ డి.జ్వాలా సాగర్ తెలిపారు. కొప్పిశెట్టి వీరవెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 14, 2025
వరంగల్: హోలీ వేడుకల్లో కలెక్టర్ శారద

టీఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుకలలో కలెక్టర్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని సూచించారు.
News March 14, 2025
అయ్యో లక్ష్యసేన్: సెమీస్‌కు చేరకుండానే ఇంటికి..

భారత యంగ్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుకు తెరపడింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ఆయన నిష్క్రమించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో తన కన్నా మెరుగైన ర్యాంకర్, చైనా ఆటగాడు లీ షి ఫెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు. వరుసగా రెండు గేముల్లో 10-21, 16-21 తేడాతో పరాజయం పాలయ్యారు. ఆటలో అతడు ఏ దశలోనూ లయ అందుకోలేదు. 2022లో లక్ష్య ఇక్కడ ఫైనల్‌కు చేరడం గమనార్హం.
News March 14, 2025
జలుమూరు: విద్యుదాఘాతంతో యువకుడి మృతి

జలుమూరు మండలంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అబ్బాయిపేట గ్రామంలో ఎర్రన్నపేట గ్రామానికి చెందిన బలగ మణికంఠ ఓ వివాహ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ లైట్ల అలంకరణ చేపట్టాడు. ఈ క్రమంలో యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం నరసన్నపేట తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు వివరించారు.