News March 31, 2024

ఉప్పల్ స్టేడియంలో దేవేందర్ గౌడ్ గేట్ ఉందని తెలుసా..?

image

HYD ఉప్పల్ స్టేడియంలో తూళ్ల దేవేందర్ గౌడ్ గేట్ ఉందన్న సంగతి మీకు తెలుసా..? తూళ్ల దేవేందర్ గౌడ్ మేడ్చల్ అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున వరుసగా మూడుసార్లు 1994, 1999, 2004లో గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగానూ వ్యవహరించారు. 2003లో స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఓ గేటుకు ఆయన పేరు పెట్టారు.

Similar News

News January 13, 2025

HYDలో 15డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

హైదరాబాద్ జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. వెస్ట్ మారేడ్‌పల్లి, సులేమాన్ నగర్‌లో 17.1℃, మోండామార్కెట్ 17.2, షేక్‌పేట 17.3, రియాసత్‌నగర్ 17.4, గోల్కొండ 17.6, ఓయూ, చాంద్రయాణగుట్ట 17.7, కంచన్‌బాగ్, మెట్టుగూడ, బౌద్ధనగర్, తిరుమలగిరి 18, అడిక్‌మెట్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట్ 18.1, బంజారాహిల్స్ 18.2, విజయనగర్ కాలనీ, కందికల్ గేట్, భోలక్‌పూర్, ముషీరాబాద్ 18.4, లంగర్‌హౌస్‌లో 18.5℃గా నమోదైంది.

News January 13, 2025

పరేడ్ గ్రౌండ్‌లో కైట్ ఫెస్టివల్ ప్రారంభించనున్న సీఎం

image

సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతోంది. ఈ ఫెస్టివల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. మొత్తం 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ ఫెస్టివల్‌లో పాల్గొనబోతున్నారు.

News January 13, 2025

 ఇంజినీరింగ్ సిలబస్‌లో మార్పులు: బాలకృష్ణా రెడ్డి

image

రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి ఏటా లక్ష మందికిపైగా పట్టభద్రులు బయటకు వస్తున్నారు. వీరిలో పది శాతం మందికి మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని JNTU ఇన్‌ఛార్జి వీసీ ప్రొఫెసర్‌ వి.బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్‌ సిలబస్‌లో నైపుణ్యాలను పెంచే పాఠ్యాంశాలు లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. అందుకే వచ్చే విద్యాసంవత్సరం నుంచి సిలబస్‌ను సమూలంగా మార్చాలంటున్నామని తెలిపారు.