News February 1, 2025
ఉమ్మడి ADB జిల్లాలో ఎంత మంది ఓటర్లున్నారో తెలుసా..!
మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 27న జరగనున్న ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5, 512 మంది ఉపాధ్యాయులు, 67, 768 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Similar News
News February 1, 2025
బీజేపీకి మంత్రి సీతక్క కౌంటర్
సోనియా గాంధీ రాష్ట్రపతిని అవమానించారన్న BJP <<15320224>>విమర్శలపై<<>> మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ‘అసలు సమస్యలను దారి మళ్లించడం, కృత్రిమ వివాదాలను సృష్టించడమే BJP ఎజెండా. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా సోనియా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. రామమందిరం, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో రాష్ట్రపతిని పక్కన పెట్టిన వారికి ఆదివాసీల గురించి మాట్లాడే హక్కు లేదు’ అని ట్వీట్ చేశారు.
News February 1, 2025
HYDలో హృదయవిదారక ఘటన
HYDలోని వారాసిగూడ PSపరిధిలో ఇంట్లో <<15323241>>తల్లి మృతదేహంతో<<>> ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే బౌద్ధనగర్‌లోని ఓ ఇంట్లో నివాసముంటూ తల్లి ఇద్దరు కూతుర్లను చూసుకుంటోంది. తండ్రి ఆ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోగా.. గత కొద్దిరోజులుగా తల్లి లలిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 9రోజులుగా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని ఉండిపోగా.. ప్రస్తుతం ఆ పిల్లలు తల్లిలేక అనాథలయ్యారు.
News February 1, 2025
HYDలో హృదయవిదారక ఘటన
HYDలోని వారాసిగూడ PSపరిధిలో ఇంట్లో <<15323241>>తల్లి మృతదేహంతో ఇద్దరు కూతుర్లు<<>> ఉన్న విషయం తెలిసిందే. అయితే బౌద్ధనగర్‌లోని ఓ ఇంట్లో నివాసముంటూ తల్లి ఇద్దరు కూతుర్లను చూసుకుంటోంది. తండ్రి ఆ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోగా.. గత కొద్దిరోజులుగా తల్లి లలిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 9 రోజులుగా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని ఉండిపోగా ప్రస్తుతం ఆ పిల్లలు తల్లిలేక అనాథలయ్యారు.