News February 6, 2025
ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.
Similar News
News February 6, 2025
నిర్మల్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో సుమారు 396 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 6, 2025
కొమురంభీమ్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!
కొమురంభీమ్ జిల్లాలోని 15 మండలాల్లో సుమారు 402 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 6, 2025
జగిత్యాల ఆర్టీసీ DMను సన్మానించిన MD సజ్జనార్
జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత కొత్త బస్టాండులో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ మహిళ ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన డిపో మేనేజర్ ఆ మహిళకు CPR చేసి సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమె సేవలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ బస్ భవన్‌లో డీఎం సునీతను సన్మానించారు. ఈ సందర్భంగా డీఎంను డిపో ఉద్యోగులు అభినందించారు.