News May 21, 2024
ఉమ్మడి అనంత జిల్లాలోని ఐటిఐ అభ్యర్థులకు శుభవార్త
అనంతపురం జిల్లాలోని ఐటిఐ అభ్యర్థులకు ఈనెల 23న ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రామమూర్తి తెలిపారు. హోండా మోటార్, స్కూటర్ ఇండియా సంస్థలు ప్రాంగణ నియామకాలకు హాజరవుతాయన్నారు. ఐటిఐ చదువుతున్న, కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10గంటలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు.
Similar News
News December 26, 2024
ధాన్యం కొనుగోలు కొనసాగించండి: రాయదుర్గం ఎమ్మెల్యే
అనంతపురం జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని, ప్రభుత్వం ప్రకటించిన ధరతో సకాలంలో కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులను ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ఆయన సంబంధిత అధికారులు డీఎం రమేశ్ రెడ్డి, ప్రసాద్ బాబు, డీటీ సుబ్రహ్మణ్యంలతో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. రాయదుర్గం, శింగనమల నియోజకవర్గాలలో గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
News December 26, 2024
నల్లచెరువు: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
నల్లచెరువు మండలం పరిధిలోని కే పూలకుంట గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హరి(33) అనే యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 26, 2024
బత్తలపల్లి: రైలు నుంచి కిందపడి యువతికి గాయాలు
బత్తలపల్లి మండలం డి చెర్లోపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కర్నూల్(D)కరివేములకు చెందిన హరిత రైలు నుంచి కిందపడి గాయపడింది. రైలులో బాత్‌రూమ్ వెళ్లి తిరిగి సీటు వద్దకు రాకపోవడంతో తమ్ముడు ధర్మవరం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమె మొబైల్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్‌మెన్‌ను అప్రమత్తం చేయడంతో డి చెర్లోపల్లి వద్ద గుర్తించారు. ఆమెను బత్తలపల్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.