News July 30, 2024
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేటి HIGHLIGHTS
◆ నిర్మల్: రన్నింగ్ బస్సులో మహిళపై అత్యాచారం
◆ ఆదిలాబాద్: రెండు ఆలయాల్లో దొంగతనం
◆ వాంకిడి: పేకాట ఆడుతున్న నలుగురిపై కేసు
◆ బాసర: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
◆ గుడిహత్నూర్: విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి
◆ మంచిర్యాల: గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అరెస్ట్
◆ పెంబి: పురుగుల మందు తాగి యువకుడు మృతి
◆ ముధోల్: కుక్కల దాడిలో దూడ మృతి
Similar News
News December 30, 2024
ఆసిఫాబాద్: మంత్రి సీతక్కను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్కను ఆదివారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధి కేటాయించాలన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.
News December 29, 2024
రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఉమ్మడి ADBజట్టు
హన్మకొండలో జరుగుతున్న రాష్ట్రస్థాయి CMకప్ హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికలజట్టు ఫైనల్స్ లో ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వరంగల్ జట్టుతో తలపడి 12గోల్స్ ఆధిక్యంలో జిల్లా జట్టు విజయం సాధించింది. జిల్లా క్రీడాకారులు,కోచ్ అరవింద్ ను ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు,కనపర్తి రమేష్,పలువురు అభినందించారు.
News December 29, 2024
నిర్మల్: ‘నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి’
నిర్మల్ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. డిసెంబర్ 31న జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తారని గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగవద్దని, మైనర్లు వాహనాలు నడపవద్దని, గుంపులు గుంపులుగా రోడ్లపై తిరగవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.