News April 21, 2025
ఉమ్మడి కడప జిల్లా టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి కడప జిల్లాలో డీఎస్సీ ద్వారా <<16156023>>705 పోస్టులు<<>> భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-284 ➤ BC-A:54 ➤ BC-B:61
➤ BC-C:07 ➤ BC-D:50 ➤ BC-E:24
➤ SC- గ్రేడ్1:17 ➤ SC-గ్రేడ్2:44
➤ SC-గ్రేడ్3:55 ➤ ST:43 ➤ EWS ➤ 66.
Similar News
News April 21, 2025
ఆనందపురం: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన శరీరం

ఆనందపురం మామిడిలోవ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆనవాళ్లు గుర్తు పట్టలేనంతగా మృతదేహం నుజ్జునుజ్జైంది. హిట్ అండ్ రన్ కేసుగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నామని ఆనందపురం ఎస్సై సంతోష్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 21, 2025
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

ఇండియన్ షేర్ మార్కెట్ లాభాల బాటలో దూసుకుపోతుంది. ఉదయం 518 పాయింట్లు లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ 939 పాయింట్లు పెరిగి 79,492 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 329 పాయింట్లు లాభపడి 24,158 వద్ద కొనసాగుతోంది. టాటా, ఐడియా, HDFC, ఏంజిల్ వన్ కంపెనీలు టాప్ గైనర్‌లుగా ఉన్నాయి.
News April 21, 2025
నిర్మల్‌లో వడదెబ్బతో ఇద్దరు మృతి

వడదెబ్బతో ఇద్దరు మృతి చెందిన ఘటన సోమవారం నిర్మల్ పట్టణంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కురన్నపేట్ కాలనీకి చెందిన శంకర్(48), రాజు (42) ఆదివారం పోచమ్మ పండుగ ఉండటంతో డప్పు కొట్టడానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చాక నీరసంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందారు. మృతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారని.. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.