News May 15, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వర్ష సూచన

image

తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే జూన్ 1న కేరళను ఋతుపవనాలు తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Similar News

News January 23, 2025

పోచంపల్లి: డివైడర్‌ను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు

image

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామానికి చెందిన వరాల రవి కుటుంబం కారులో వెళుతుండగా పోచంపల్లి వద్ద డివైడర్‌కు ఢీకొన్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న108 వాహన సిబ్బంది గాయాలపాలైన నలుగురిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News January 23, 2025

శుక్రవారం కరీంనగర్‌లో పర్యటించనున్న మంత్రి పొన్నం

image

రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ శుక్రవారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఉదయం 09.00 గంటలకు మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొంటారనీ మంత్రి క్యాబ్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రులతో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్టేడియం కాంప్లెక్స్, మల్టీపర్పస్ స్కూల్ పార్కును తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

News January 23, 2025

కరీంనగర్: స్పౌజ్ కేటగిరికి దరఖాస్తులు

image

స్పౌజ్ బదిలీలకు సంబంధించి ముందడుగు పడింది. వివిధ జిల్లాల నుంచి కరీంనగర్‌కు 143 మంది టీచర్స్ రానున్నారు. ఈ మేరకు వారు డీఈవో ఆఫీసులో రిపోర్ట్ చేశారు. వారికి త్వరలో కౌన్సెలింగ్ జరగనుంది. వీరంతా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట నుంచి బదిలీపై రానున్నారు.