News June 30, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఇండియా వరల్డ్ కప్ గెలవడం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు. @ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ ఎల్లారెడ్డిపేట మండలంలో ఆటో బోల్తా పడి మహిళ మృతి. @ సిరిసిల్ల పట్టణంలో బావిలో పడిన పిల్లిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. @ వెల్గటూర్ మండలంలో భారీ వర్షం. @ మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న వేములవాడ డీఎస్పీ. @ రేపటినుండి నూతన చట్టాలు: జగిత్యాల ఎస్పీ.

Similar News

News November 9, 2024

సిరిసిల్ల: చేనేత దంపతుల ఆత్మహత్య

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. పట్టణంలోని వెంకంపేట్‌లో భైరి అమర్- స్రవంతి అనే చేనేత దంపతులు శనివారం ఆత్మహత్య
చేసుకున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా పని దొరక్క.. చేసిన అప్పులు తీర్చే మార్గం తెలియక ఇంట్లో బలవన్మరణానికి పాల్పడారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 9, 2024

HZB: కౌశిక్ రెడ్డిపై దాడిని ఖండించిన కేటీఆర్

image

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై పోలీసుల దాడిని మాజీమంత్రి, MLA కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండోవిడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా దాడి చేస్తారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులపై కూడా దాడికి దిగడమేనా.. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు.

News November 9, 2024

HZB: రేవంత్ రెడ్డి నన్ను చంపినా పర్వాలేదు: కౌశిక్ రెడ్డి

image

దళిత బిడ్డల కోసం పోరాడుతున్న తనను సీఎం రేవంత్ రెడ్డి చంపినా పర్వాలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పేద దళితులకు రూ.12 లక్షలు ఇస్తానని చెప్పారని, ఏమైందని ప్రశ్నిస్తే తన చేయి విరగొట్టారని వాపోయారు. తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. రెండో విడత దళిత బంధు ఇచ్చే వరకు పోరాటం ఆపేదే లేదన్నారు.