News March 22, 2025
ఉమ్మడి కరీంనగర్: వర్షానికి నేలకు కూలిన మొక్కజొన్న పంటలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేలకు ఒరిగింది. పలుచోట్ల వరద నీరు చేరి పంట నీట మునిగింది. చేతికి అందిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తగినంత నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News March 23, 2025
దేవాదుల పంప్ హౌస్‌ను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు

హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేట గ్రామంలో గల దేవాదుల పంప్ హౌస్‌ను ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు సందర్శించి మోటార్లను పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలోనే దేవాదుల నుంచి రైతులకు నీరు అందిందని.. ఈ కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు ను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.
News March 23, 2025
క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

క్రెడిట్ కార్డుల వాడకం ఇటీవల ఎక్కువైంది. అయితే చెల్లింపుల ఊబిలో చిక్కుకున్నవారు కార్డు క్లోజ్ చేస్తుంటారు. అది మంచిది కాదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ‘క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడమనేది మన ఆర్థిక పరిస్థితి బాలేదనే విషయాన్ని సూచిస్తుంది. దాంతో సిబిల్ స్కోర్ తగ్గే అవకాశముంది. ఒకవేళ కార్డు నిలిపేయడం తప్పనిసరైతే మరో క్రెడిట్ కార్డు తీసుకున్నాక దీన్ని క్లోజ్ చేసుకోవడం బెటర్’ అని వివరిస్తున్నారు.
News March 23, 2025
ప్రాక్టీస్ ఫొటోలు షేర్ చేసిన SRH

ఈ సీజన్‌లో SRH తొలి మ్యాచ్ మరో మూడు గంటల్లో మొదలు కాబోతోంది. రాజస్థాన్‌పై గెలిచి హోంగ్రౌండ్ తొలి మ్యాచ్‌తోనే ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇవ్వాలని ప్లేయర్స్ కసరత్తు చేస్తున్నారు. టీమ్ ప్రాక్టీస్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన SRH మేనేజ్మెంట్.. ప్రతి ఒక్కరిలో, ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆటగాళ్ల దృఢ సంకల్పం కన్పిస్తోందని కామెంట్ చేసింది. అటు స్టేడియానికి ఫ్యాన్స్ తాకిడి మొదలవగా ఉప్పల్ పరిసరాల్లో కోలాహలంగా ఉంది.