News March 22, 2025

ఉమ్మడి కరీంనగర్: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా నిన్న ఐదుగురు మృతిచెందారు. KNR(D)శంకరపట్నంలో బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని తండ్రీ, కొడుకులు షేక్ అజీమ్, అబ్దుల్ రెహ్నాన్ చనిపోయారు. సైదాపూర్‌(M)బొత్తలపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో సదయ్య మృతిచెందాడు. ఎల్లారెడ్డిపేట(M)రాచర్లబొప్పాపూర్‌లో శ్రీనివాస్ పురుగుమందు తాగి ఆత్యహత్య చేసుకున్నాడు. HZB(M)తుమ్మనపల్లి ఎస్సారెస్పీ కెనాల్‌లో అరవింద్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది.

Similar News

News March 23, 2025

గాయపడ్డ కానిస్టేబుల్‌ను పరామర్శించిన కేటీఆర్

image

కరీంనగర్‌లో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నగరంలో ర్యాలీలో నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓ మహిళా కానిస్టేబుల్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయపడ్డ పద్మజాను కేటీఆర్ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ర్యాలీలో బైక్ వేగంగా రావడంతోనే గాయపడినట్టు మహిళా కానిస్టేబుల్ కేటీఆర్‌కు వివరించారు.

News March 23, 2025

కరీంనగర్: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

image

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్‌లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!

News March 23, 2025

కరీంనగర్: పదో తరగతి పరీక్షలు.. 14 మంది గైర్హాజరు

image

శనివారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 14 మంది గైర్హాజరయ్యారు. 12,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కరీంనగర్ నగరంలోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

error: Content is protected !!