News April 21, 2025

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎస్సీ ద్వారా 2,645 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.

➤ OC-1057 ➤ BC-A:187 ➤ BC-B:259
➤ BC-C:27 ➤ BC-D:186 ➤ BC-E:99
➤ SC- గ్రేడ్1:35 ➤ SC-గ్రేడ్2:173
➤ SC-గ్రేడ్3:204 ➤ ST:161 ➤ EWS:257.
NOTE: సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం <<16156783>>ఇక్కడ క్లిక్ <<>>చేయండి.

Similar News

News December 17, 2025

మంచిర్యాల: 5 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా ధర్మరాజు

image

మూడో విడత స్థానిక ఎన్నికల్లో భాగంగా చెన్నూర్ మండల పరిధిలోని 30 గ్రామ పంచాయతీలకు బుధవారం ఎన్నికలు ముగిశాయి. మండలంలోని బీరెల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి దుర్గం ధర్మరాజు 5 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థిపై విజయం సాధించారు. కాంగ్రెస్ శ్రేణులు, యువకులు సంబరాలు చేసుకుంటున్నారు.

News December 17, 2025

RRలో బోణీ కట్టిన BRS.. బేగరికంచ సర్పంచ్‌గా వెంకటేశ్

image

3వ విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో BRS మద్దతుదారు బోణి కొట్టారు. కందుకూరు మండలం బేగరికంచ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. BRS బలపరిచిన వాడ్యావత్ వెంకటేశ్ నాయక్ సమీప ప్రత్యర్థిపై 118 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 4 వార్డుల్లో BRS, మిగతా 4 వార్డుల్లో కాంగ్రెస్ వార్డు సభ్యులు విజయం సాధించారు. ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉండే బేగరికంచలో BRS మద్దతుదారు గెలవడంతో శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News December 17, 2025

సూర్యాపేటలో తొలి సర్పంచ్ విజయం

image

సూర్యాపేట జిల్లాలో బుధవారం నిర్వహించిన మూడో విడత ఎన్నికల మొదటి ఫలితం విడుదలైంది. ఈ ఎన్నికలో నేరేడుచర్ల మండలం జానలదిన్నె గ్రామ పంచాయతీ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గజ్జి సరిత బీఆర్ఎస్ అభ్యర్థిపై 30 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో ఆమె హర్షం వ్యక్తం చేశారు. తన ఎన్నికకు సహకరించిన ఓటర్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి తన వంతు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానన్నారు.