News July 30, 2024

ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్ టాప్

image

బాధితులు పోగొట్టుకున్న, చోరీ అయిన సెల్‌ఫోన్లు గుర్తించడంలో ఉమ్మడి జిల్లాలో ఆసిఫాబాద్ ముందంజలో ఉంది. 63.98% ఫోన్ల ఆచూకీని తెలుసుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఆదిలాబాద్ (63.42%), రామగుండం (61.54%), నిర్మల్(61.32%) ఉన్నాయి. చరవాణులను బాధితులకు అప్పగించడంలో రామగుండం 29.15% తో 1 వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో నిర్మల్(28.48 %), 3వ స్థానంలో ఆదిలాబాద్(24.63%), 4వ స్థానంలో ఆసిఫాబాద్ 22.66% ఉన్నాయి.

Similar News

News December 21, 2024

నిర్మల్: ‘రైతులకు అవగాహన కల్పించాలి’

image

ఆధునిక పద్ధతులలో సంప్రదాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఆహార భద్రత పథకం-2024, కింద జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న కార్యాచరణపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మహిళా శక్తి క్యాంటీన్లలో సేంద్రియ ఉత్పత్తుల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

News December 21, 2024

ఆసిఫాబాద్: 44 కేసులలో 59 మంది అరెస్ట్

image

అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా SPశ్రీనివాసరావు హెచ్చరించారు. SP మాట్లాడుతూ.. జిల్లాలో జూన్ నుంచి ఇప్పటివరకు అక్రమంగా గుట్కాలు అమ్ముతున్న వారిలో 44 కేసులలో 59మందిని అరెస్ట్ చేసి, రూ.38,38152/-విలువగల గుట్కా రికవరీ చేశామన్నారు. PDS బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి లాంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

News December 21, 2024

మంచిర్యాల: బస్టాండ్ శుభ్రం చేయాలని మందుబాబులకు శిక్ష

image

ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి ఈనెల 18న కోర్టులో హాజరు పర్చగా 2వ అదనపు మెజిస్ట్రేట్ మంచిర్యాల బస్టాండను 5 రోజుల (ఈనెల 20 నుంచి 24) వరకు శుభ్రం చేయాలని శిక్ష విధించారు. ఇది ఇలా ఉండగా మరో 22మందిని ఇవాళ కోర్టులో హాజరు పరచగా 14మందిని 5రోజులు ట్రాఫిక్ అసిస్టెంట్ విధులు నిర్వర్తించాలని, మిగతా వారికి రూ.17500/-జరిమానా విధించారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B.సత్యనారాయణ తెలిపారు.