News April 22, 2025

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీల వివరాలు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీలు తెలుగు-39, హిందీ-23, ఇంగ్లిష్-95, లెక్కలు-94, ఫిజిక్స్-24, బయాలజీ-70, సోషల్-106, PET- 72, SGT- 106 జిల్లా విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే DSC దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, మే- 15వ తేదీతో ముగుస్తుందని అధికారులు వెల్లడించారు. జూన్ 6, జూలై 6 తేదీల మధ్యలో పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తెలిపారు.

Similar News

News April 23, 2025

పర్వతాపూర్: భారీ మొత్తంతో చదువు‘కొనాలా’?

image

పర్వతాపూర్ అరోరా కాలేజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా తమపై ఫీజుల భారం మోపుతోందని నిరసనకు దిగారు. తరగతులను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. ఫీజు చెల్లింపుల్లో పారదర్శకత లేకపోవడం, చెల్లించిన రుసుములకు రసీదు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ప్రాంగణ నియామకాలు చేపట్టడం లేదని విద్యార్థులు గళమెత్తారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు వెనకడుగు వేయమని తేల్చి చెప్పారు.

News April 23, 2025

సాగర్ కలుషితం తీరుతుందెప్పుడో!

image

HYDలోని హుస్సేన్ సాగర్ రోజురోజుకు కలుషితం అవుతోంది. ఇటీవలే PCB నిర్వహించిన వాటర్ క్వాలిటీ టెస్ట్ రిపోర్టులో ఇది వెల్లడైంది. ఖైరతాబాద్ STP, సంజీవయ్య పార్కు వద్ద BOD స్థాయి పరిమితికి మించి 86,92గా భారీగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. నీటి జీవరాశులు బతికేందుకు నీటిలో కరిగే ఆక్సిజన్ అవసరం. దీని స్థాయి రోజురోజుకూ అనేక ప్రాంతాల్లో తగ్గుతున్నట్లు PCB లెక్కల్లో తేలింది.

News April 23, 2025

VJA: చోరీ చేసి.. ప్రజలకు అమ్మేశారు

image

తక్కువ ధరకు వాహనాలు అమ్ముతామనే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మాచవరం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు వాహనాలు చోరీ చేసి ప్రజలకు తక్కువ ధరకు వాహనాలు అమ్మినట్లు చెప్పారు. ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!