News March 22, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔పలుచోట్ల ఇఫ్తార్ విందు ✔టెన్త్ పరీక్షలు.. తనిఖీ చేసిన కలెక్టర్లు ✔CMను కలిసిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ✔వరల్డ్ వైడ్ కాంటెస్ట్‌లో గద్వాల ఇన్‌స్టా రీల్ ✔నాగర్‌కర్నూల్:Way2Newsతో చెంచులు ✔అయిజ: వేరుశనగతో వెళ్తున్న ఆటో బోల్తా ✔NGKL: ‘ఈనెల 26న వేసెక్టమి ఆపరేషన్లు’ ✔ఘనంగా ‘ప్రపంచ కవితా దినోత్సవం’ ✔NRPT: భార్యను చంపిన భర్త అరెస్ట్ ✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
Similar News
News March 22, 2025
రేపు, ఎల్లుండి వర్షాలు

TG: నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఇవాళ బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, పిడుగులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈరోజు రాత్రి వరకు కొన్ని చోట్ల వాన పడుతుందని పేర్కొంది.
News March 22, 2025
జడ్చర్ల: ‘విద్యుత్ సరఫరా లేక ఎండుతున్న పంటలు’

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా లేక నీళ్లు పెట్టకపోవడంతో మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని కిష్టారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా Way2Newsతో రైతు పి.వెంకటేశ్ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా సరిగా లేక వేల పెట్టుబడితో పెట్టిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నామని, విద్యుత్ అధికారులు స్పందించి 24 గంటలు కరెంట్ సరఫరా చేయాలని అన్నారు.
News March 22, 2025
గద్వాల: ఈ ఫొటోకు ఐదేళ్లు..!

కరోనా కారణంగా జోగులాంబ గద్వాల జిల్లాలో నేటికి జనతా కర్ఫ్యూ విధించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి ఒక్కరూ కూడా చాలావరకు సోషల్ మీడియా ద్వారా జనతా కర్ఫ్యూ పేరిట పోస్టులు చేసుకుంటున్నారు. నాటి గద్వాల కర్ఫ్యూపై తీసిన ఫొటో ఐదేళ్లు పూర్తి చేసుకుందని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.