News April 10, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

✔MBNR: నేడు జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవ్
✔గ్రామాల్లో తాగునీటి పరీక్షలు
✔నేటి రంజాన్ వేళలు:ఇఫ్తార్(బుధ):6:38
✔కోస్గి:నేడు కరెంట్ కట్
✔నేడు సంయుక్త ఖాతాల కొరకు దరఖాస్తు చేసుకోండి:DEOలు
✔పరుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✔ఇఫ్తార్ విందు.. హాజరుకానున్న స్థానిక MLAలు,ప్రజాప్రతినిధులు
✔SA-2 పరీక్షలపై అధికారుల ఫోకస్
✔దామరగిద్ద:నేడు సమీక్ష..11 నుంచి వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం
✔కొనసాగుతున్న తనిఖీలు
Similar News
News April 21, 2025
MBNR: ‘చెరువులలో పూడికతీత చేపట్టాలి’

జిల్లాలోని చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పూడికతీత పనులు చేపట్టడం ద్వారా చెరువులు, కుంటలలో నీరు ఎక్కువగా నిలిచి చేపల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. చేపల వేట, విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.
News April 21, 2025
రేపే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 10,922, సెకండియర్‌లో 11,561 మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం రేపటితో తేలనుంది. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.
– ALL THE BEST
News April 21, 2025
MBNR: ‘మోడల్ నీట్ పరీక్షను విజయవంతం చేయండి’

దేశ వ్యాప్తంగా మే 4న నీట్ పరీక్ష ఉంది. ఈ క్రమంలో ముందుస్తుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ నీట్ పరీక్ష ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సా.5 వరకు, 24వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 12 వరకు MBNRలో నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్, భరత్ అన్నారు. ఈ పేపర్ ఐఐటీ చుక్కా రామయ్య సంస్థ నుంచి వస్తుందని తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.