News March 29, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు
✔నేడు పాలమూరుకు కిషన్ రెడ్డి రాక ✔అచ్చంపేట:నేటి నుంచి రెండు రోజులు వ్యవసాయ మార్కెట్ బంద్ ✔గద్వాల్, వనపర్తి: పలు గ్రామాలలో కరెంట్ కట్ ✔పలు నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థుల పర్యటన ✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వాహనాల తనిఖీలు ✔నవాబుపేట: నేటి నుంచి మలక్ షా బాబా ఉర్సు ప్రారంభం ✔నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(శుక్ర)-6:35,సహర్(శని):4:50 ✔త్రాగు నీరు, ఉపాధి హామీ పనులపై అధికారుల ఫోకస్
Similar News
News January 11, 2025
MBNR: ‘సంక్రాంతికి ఊరికెళ్తున్నారా.? ఇది మీకోసమే.!’
✓ విలువైన వస్తువులు, నగదు, నగలు ఇంట్లో ఉంచకపోవడం మంచిది.✓ ఊరికి వెళ్తున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టకండి.✓ ఇంటి ఆవరణలో లేదా ఏదైనా గదిలో లైటు వేసి ఉంచండి.✓ నమ్మకమైన వ్యక్తిని వాచ్మెన్గా పెట్టుకోవడం మంచిది.✓ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వాటికి మొబైల్ అనుసంధానం చేసుకోవాలి.✓ ఇంటితాళం బయటకు కనిపించకుండా చూసుకోండి.✓ ఊరికి వెళ్లేముందు పోలీస్ స్టేషన్లో తెలపడం ఉత్తమం.
News January 11, 2025
MBNR: కురుమూర్తి స్వామి గిరి ప్రదక్షిణ.. హాజరైన భక్తులు
కురుమూర్తి స్వామి దేవాలయంలో ఈ ఏడాది నుంచి కొత్తగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు. దేవాలయ చరిత్రలో తొలిసారిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ పూజారులు తెలిపారు. తొలిసారి నిర్వహించిన స్వామి వారి గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News January 11, 2025
MBNR: కొత్త రేషన్ కార్డులు.. చిగురించిన ఆశలు
సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో MBNR-30,345, GDWL-13,189, NGKL-28,773, NRPT-9,391, WNP-11,501 కలిపి మొత్తం 93,199 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి పాలమూరులో మొత్తం 9,26,636 రేషన్ కార్డులు ఉన్నాయి.