News October 4, 2024
ఉమ్మడి జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు వాడపల్లి ఎస్సైగా పనిచేస్తున్న ఈడుగు రవి, హాలియా ఎస్సై సతీష్ రెడ్డిలను నల్లగొండ ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలోని పెన్ పహాడ్ ఎస్సై రవీందర్, ఆత్మకూరు(ఎస్) ఎస్సై వై.సైదులు, తుంగతుర్తి ఎస్సై ఏడుకొండలును ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేశారు.
Similar News
News December 21, 2024
నల్గొండ ప్రజలకు విషమిచ్చి చంపండి: కోమటిరెడ్డి
CM రేవంత్ మూసీని అభివృద్ధి చేసి NLG జిల్లా ప్రజల బాగు కోరుతుంటే బావబామ్మర్దులు(కేటీఆర్, హరీశ్‌రావు) అడ్డుపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో ఫైరయ్యారు. తాము బతకాలని లేకుంటే విషమిచ్చి చంపండని అసహనం వ్యక్తం చేశారు. గత పదేళ్ల నుంచి నల్గొండ జిల్లాకు ఒక్క ఎకరాకు కూడా ఎక్కువగా ఇరిగేషన్ వాటర్ ఇవ్వలేదన్నారు. ఏ ఒక్క సాగు నీటి ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించిన దాఖలాలు లేవన్నారు.
News December 21, 2024
రైతు జీవితాల్లో ఇక సం’క్రాంతి’ : కోమటిరెడ్డి
సంక్రాంతి నుండి సాగు చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసాను అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడా. సంక్రాంతి నుంచే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఇందిరా స్వశక్తి మహిళ సంఘాలను బలోపేతం చేసేందుకు లక్ష కోట్ల రూపాయలను ఇచ్చి మహిళలను కోటీశ్వరులను చేస్తామని తెలిపారు.
News December 20, 2024
నల్గొండ మంత్రులు ఏదడిగినా కాదనరు: కూనంనేని
నల్గొండ మంత్రులపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రశంసలు కురిపించారు. నల్గొండ జిల్లా మంత్రులు బోళాశంకరులని ఏది అడిగినా ఆలోచించకుండానే సరే అంటారని చెప్పారు. కానీ ఖమ్మం జిల్లా మంత్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓకే చేస్తారని గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యాఖ్యానించారు. కాగా జిల్లా మంత్రులపై కూనంనేని వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. కూనంనేని వ్యాఖ్యలపై మీ కామెంట్స్.