News March 16, 2025

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోనే టాప్ కరీంనగర్

image

ఉమ్మడి జిల్లాలో ఎండ దంచికొడుతోంది. శనివారం కరీంనగర్ జిల్లా బూర్గుపల్లిలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 41.5, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, పెద్దపల్లి జిల్లా మంథనిలో 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

Similar News

News March 16, 2025

ఓయూలో ఏకమవుతున్న విద్యార్థి సంఘాలు !

image

ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించకూడదని అధికారులు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా అన్ని విద్యార్థి సంఘాలు ఏకమవుతున్నాయి. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు.

News March 16, 2025

అర్ధరాత్రి మహిళా ఎంపీ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు

image

TG: బీజేపీ ఎంపీ డీకే అరుణ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లో అర్ధరాత్రి ఆగంతకుడు కలకలం రేపాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడిన దుండగుడు కిచెన్, హాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దుండగుడు వచ్చిన సమయంలో MP ఇంట్లో లేకపోవడం గమనార్హం. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు డీకే అరుణ ఫిర్యాదు చేశారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందని, భద్రత పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.

News March 16, 2025

శ్రీకాకుళంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ దారి జడ్జి బంగ్లా ఎదురుగా గల మురికి కాలువలో ఓ గుర్తుతెలియని వ్యక్తి (45) పడిపోయి ఉండగా స్థానికులు ఈ నెల 13న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడని శ్రీకాకుళం టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిస్తే 63099 90824 నంబర్‌ను సంప్రదించాలని సీఐ సూచించారు.

error: Content is protected !!