News August 10, 2024

ఉమ్మడి తూ.గో.లో పిడుగులు పడే అవకాశం

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోనసీమ, కాకినాడ రూరల్, తుని, పెద్దాపురం, అనపర్తి, సామర్లకోట, రాజమండ్రి రూరల్, రంపచోడవరం, ఏజెన్సీ ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ మేరకు ప్రజల ఫోన్లకు పిడుగుపాటు హెచ్చరికల సందేశాలు పంపించారు.

Similar News

News October 7, 2024

రంపచోడవరం: CRPF జవాన్ మృతి

image

చింతూరు మండలంలో విషాదం జరిగింది. వేటగాళ్లు పెట్టిన విద్యుత్ వైర్లు తగలడంతో సీఆర్పీఎఫ్ జవాను తిరువాల కారాసు (55) ఆదివారం రాత్రి మృతిచెందాడు. వివరాలు.. డొంకరాయి పరిసరాల్లో రాత్రి 2 గంటలకు కూంబింగ్ విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 7, 2024

ధవళేశ్వరం బ్యారేజీ UPDATE

image

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 1.62 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని తెలిపారు.

News October 7, 2024

సామర్లకోటలో 8న మినీ జాబ్ మేళా

image

సామర్లకోట టీటీడీసీలో 8న (మంగళవారం) ఉదయం 10.గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి సంస్థ అధికారి శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు, సీడన్ జేడీఎం కిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. వివిధ ఉద్యోగుల్లో పని చేసేందుకు పది, ఇంటర్, ఐటీఐ, ఫిట్టర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు.