News March 14, 2025

ఉమ్మడి పాలమూరు జిల్లాలో భానుడి భగభగలు..

image

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా మహబూ‌నగర్ జిల్లా కొత్తపల్లిలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా జక్లేరులో 40.1 డిగ్రీలు, వనపర్తి జిల్లా కేతపల్లిలో 40.0 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లిలో 40.0 డిగ్రీలు, గద్వాల జిల్లా మల్దకల్లో 40.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 15, 2025

యూఎస్‌లో ఎప్పటికీ భాగమవ్వం: కెనడా ప్రధాని

image

కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ వస్తూనే తన మార్క్ చూపించారు. తమ దేశం ఎప్పుడూ యూఎస్‌లో భాగం కాబోదని స్పష్టం చేశారు. అయితే దేశ ప్రయోజనాల కోసం తాము ట్రంప్ అడ్మినిష్ట్రేషన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా జస్టిన్ ట్రూడో స్థానంలో కార్నీ కెనడా 24వ ప్రధాని ప్రమాణస్వీకారం చేశారు. ట్రంప్ యూఎస్ అధ్యక్షుడు అయ్యాక కెనడాను తమ దేశంలో భాగమవ్వమని కోరిన సంగతి తెలిసిందే.

News March 15, 2025

NZB: గ్యాస్ స్టవ్ పేలి వాచ్‌మెన్ మృతి

image

నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో నాలుగేళ్లుగా వాచ్‌మెన్‌గా పని చేసే కోట్ల అనంత్(52) ఈ నెల 6న టీ పెట్టుకునేందుకు స్టవ్ ముట్టించగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం చికిత్స పొందుతూ అనంత్ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా దిబ్బిడి గ్రామం అని పోలీసులు తెలిపారు.

News March 15, 2025

జగన్ మరో 20ఏళ్లు కలలు కనాలి: నాగబాబు

image

AP: నోటి దురుసు ఉన్న నేతకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలేదని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. వచ్చేసారి అధికారం తమదే అని జగన్ అంటున్నారని అంతకన్నా హాస్యం మరోటిలేదన్నారు. మరో 20సంవత్సరాలు జగన్ ఇలానే కలలు కంటూ ఉండాలని కోరారు. దేవుడైనా అడిగితే వరాలు ఇస్తాడు కానీ పవన్ అడగకుండానే వరాలు ఇస్తాడని కొనియాడారు. రెండు మూడు తరాల గురించే ఆలోచించే వ్యక్తి ఆయనని అందుకే అయనకు అనుచరుడిగా ఉంటున్నానని తెలిపారు.

error: Content is protected !!