News April 13, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేటి “TOP NEWS”

image

√MBNR: పాలమూరు ప్రగతి కాంగ్రెస్ తోనే సాధ్యం: వంశీచంద్ రెడ్డి.
√MBNR:మోడీని గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధి: DK అరుణ.
√ మద్దూర్: BRSనువీడియో ప్రసక్తి లేదు: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం.
√ భూత్పూర్: DK అరుణ ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి వెన్నుపోటు: దేవరకద్ర ఎమ్మెల్యే.
√ మక్తల్: సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన జలంధర్ రెడ్డి.
√ కొడంగల్: రాష్ట్రంలో తాగునీటి కొరత లేదు: సందీప్ కుమార్ సుల్తానియా.

Similar News

News April 22, 2025

నారాయణపేట: బాలికపై యువకుడి అత్యాచారం

image

NRPT జిల్లా మద్దూరులో బాలికపై అత్యాచారం జరిగింది. కోస్గి సీఐ సైదులు తెలిపిన వివరాలు.. దామరగిద్ద మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) మద్దూరులో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. దామరగిద్ద వాసి బోయిని శ్రీనివాస్(24) ఈనెల 10న బాలికకు మాయమాటలు చెప్పి తన బైక్‌పై HYDకు తీసుకెళ్లి ఓ కిరాయి రూంలో అత్యాచారం చేసి, తెల్లారి మద్దూరు బస్టాండ్‌లో వదిలేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News April 22, 2025

నేడే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

image

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 10,922 సెకండియర్‌లో 11,561 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం నేటితో తేలనుంది. ఇంటర్మీడియట్ ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.- ALL THE BEST

News April 22, 2025

నాగర్‌కర్నూల్: రంపంతో భర్త గొంతు కోసిన భార్య..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వెంకటేశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. అవుసలికుంటలో కురుమయ్య, చెన్నమ్మ దంపతులు ఉంటున్నారు. ఈనెల 19న భార్యతో కురుమయ్య గొడవపడ్డాడు. అదేరోజు రా.11 గంటలకు భర్త నిద్రిస్తుండగా చెన్నమ్మ కోపంతో వెళ్లి రంపం బ్లేడ్ తీసుకొచ్చి కురుమయ్య గొంతు కోసింది. అతడు అరవగా పక్కింట్లో ఉన్న బంధువులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదైంది.

error: Content is protected !!