News May 18, 2024
ఉమ్మడి వరంగల్: 1,67,853 మంది ఓటర్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి మే 27న పోలింగ్ జరగనుంది. రాకేశ్ రెడ్డి (BRS), తీన్మార్ మల్లన్న (INC), ప్రేమెందర్ రెడ్డి (BJP)తో పాటు మరో 49 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌లోని 6 జిల్లాల వ్యాప్తంగా 1,67,853 మంది ఓటు హక్కు పొందారు. అత్యధికంగా WGL జిల్లాలో 43,594, HNKలో 43,383, MHBD 34,759, జనగామ 23,320, భూపాలపల్లి 12,460, ములుగులో అతి తక్కువగా 10,237 మంది ఓటర్లు ఉన్నారు.
Similar News
News January 13, 2025
భక్తులతో కిక్కిరిసిన కొమురవెల్లి మల్లన్న
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారులు తీరారు. జనవరి 19న పట్నం వారం (మొదటి వారం)తో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ తరుణంలో ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగిందని ఆలయ వర్గం వెల్లడించింది. ఈఓ రామాంజనేయులు, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున, తదితరులు భక్తులకు సేవలందించారు.
News January 13, 2025
భోగి స్పెషల్.. భద్రకాళి అమ్మవారి దర్శనం
వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేపట్టారు. నేడు భోగి పర్వదినం, సోమవారం సందర్భంగా అర్చకులు అమ్మవారు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కాగా, సంక్రాంతి సెలవులు రావడంతో ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.
News January 13, 2025
వరంగల్: ఘోరం.. మూడేళ్ల బాలుడి మృతి
నీటి సంపుటిలో పడి మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. వరంగల్(D) సంగెం (M) ఆశాలపల్లిలో జరిగింది. పోలీసుల ప్రకారం.. కొండపర్తికి చెందిన రాజు-స్రవంతి పండుగకు ఆశాలపల్లికి వచ్చారు. నిన్న రివాన్స్(3) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. కొద్ది సమయం తర్వాత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వేతకగా నీటి సంపుటిలో పడి కనిపించాడు. MGMకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.