News February 28, 2025

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 93.57% పోలింగ్

image

ఉమ్మడి WGL-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న నల్గొండలో లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా. 4 గం. వరకు 93.57% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా.. హనుమకొండ 91.66, వరంగల్ 94.13, జనగామ 94.31, మహబూబాబాద్ 94.47, భూపాలపల్లి 93.62, ములుగులో 92.83% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మీరు ఓటు వేశారా? కామెంట్ చేయండి.

Similar News

News December 23, 2025

డిసెంబర్ 23: చరిత్రలో ఈ రోజు

image

☛ 1902: భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ జననం
☛ 1940: ప్రముఖ నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్ జననం
☛ 1997: పండితుడు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి మరణం
☛ 2004: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణం(ఫొటోలో)
☛ 2014: ప్రముఖ దర్శకుడు బాలచందర్ మరణం
☛ 2022: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మరణం
– జాతీయ రైతు దినోత్సవం

News December 23, 2025

పాలమూరు: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరం 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సమన్వయకర్త బి.నాగమణి మాల తెలిపారు. జనవరి 21 వరకు ఆన్‌లైన్‌లో రూ.100 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.

News December 23, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.