News October 29, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> JN: తాడి చెట్టుపై నుండి జారిపడి దుర్మరణం
> WGL: విషాదం.. గుండెపోటుతో ఒకరి మృతి
> MHBD: షీ-టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
> WGL: గంజాయి పట్టివేత
> MLG: ప్రమాదాల నివారణకు బారికేడ్స్ ఏర్పాటు
> HNK: వరద కాలువలో గల్లంతయిన వైద్యుడి మృతదేహం లభ్యం
> MLG: బోల్తా పడిన ఇసుక లారీలు
> JN: అగ్ని ప్రమాదానికి గురైన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
Similar News
News November 6, 2024
WGL: ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు షెడ్యూలు జారీ
ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించాల్సిన తేదీలను, ఫీజుల మొత్తం వివరాలను ఇంటర్ బోర్డు జారీ చేసిందని డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్ బోర్డు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 25 తేదీలోగా ఫీజులు చెల్లించవచ్చని అన్నారు.
News November 5, 2024
రాహుల్ గాంధీని కలిసిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లతో కలిసి మంత్రి కొండా సురేఖ కలిశారు. అనంతరం పలు అంశాలపై రాహుల్ గాంధీ, నేతలతో మంత్రి కొండా సురేఖ చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్సి, తదితరులు ఉన్నారు.
News November 5, 2024
WGL: KU ఫీజు చెల్లింపునకు రేపే ఆఖరు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు రేపటితో ముగియనున్నట్లు KU అధికారులు తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 11 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.