News September 25, 2024

ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి ఆటల పోటీలు

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయిలో ఈనెల 26 నుంచి నిర్వహించే స్కూల్స్, జూనియర్ కళాశాలల క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి దేముడు బాబు తెలిపారు. అండర్-14, అండర్-17 బాల బాలికల అథ్లెటిక్స్ ఏయూ గ్రౌండ్‌లోను, రెజ్లింగ్ పోటీలు అల్లూరి జిల్లా కొయ్యూరులో జరుగుతాయన్నారు. 27న ఆనందపురంలో అండర్-17 బాల బాలికల మోడరన్ పెంటాథిలిన్ పోటీలు నిర్వహిస్తామన్నారు.

Similar News

News December 21, 2024

విశాఖ: అక్రమంగా అమ్మాయిలను తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

అక్రమంగా 11 మంది అమ్మాయిలను ఒడిశాలోని నవరంగ్‌పూర్ నుంచి చెన్నై ట్రైన్‌లో  తరలిస్తున్న నిందితుడు రవికుమార్‌ను శనివారం అరెస్టు చేశామని విశాఖ రైల్వే సీఐ ధనంజయ నాయుడు తెలిపారు. 11 మందిని పని పేరుతో అక్రమంగా ఆధార్ టాంపర్ చేసి గార్మెంట్‌లో పని కోసం తిమ్మాపూర్ తరలిస్తున్నారని గుర్తించామని అన్నారు. అక్రమ రవాణా, ఆధార్ టాంపరింగ్‌పై సెక్షన్ 143 (5)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

News December 21, 2024

విశాఖలో వర్షం.. మ్యాచ్ రద్దు

image

విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం విశాఖలో జరగాల్సిన ఛత్తీస్‌గఢ్, మిజోరం మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యాహ్నం 12 గంటలకు రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజయ్ హజారే ట్రోఫీలో మొదటి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

News December 21, 2024

మీరు పడే తపన కన్నీళ్లు తెప్పిస్తోంది: పవన్ కళ్యాణ్

image

అనంతగిరి మండలం బల్లగరువులో రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన అనంతరం Dy.CM పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. వెంటనే అక్కడున్న ప్రజలు నీళ్లు తాగాలని సూచించగా.. ‘మా ఇంట్లో వాళ్లు నా కోసం ఎంత తపన పడతారో తెలీదు కానీ.. మీరు పడే తపన కన్నీళ్లు తెప్పిస్తోంది’ అని అన్నారు. ఐదేళ్లు మీకోసం పని చేస్తానని.. ఈ ఐదేళ్ల తర్వాత ప్రోగ్రస్ రిపోర్ట్ ఇవ్వాలని గిరిజనులకు ఆయన కోరారు.