News November 13, 2024
ఉమ్మడి విశాఖ జిల్లాలో కార్పొరేషన్ డైరెక్టర్లు వీరే
రాష్ట్ర గవర కార్పొరేషన్‌కు ప్రభుత్వం 15 మంది డైరెక్టర్లను నియమించింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినవారు 11 మంది ఉన్నారు. పరమేశ్వరరావు(పెందుర్తి),పి.అజయ్ బాబు (విశాఖ),ఏ.మంగరాజు (నర్సీపట్నం), బి.శ్రీనివాసరావు (ఎలమంచిలి),బీ.గోపికృష్ణ (విశాఖ), బి.లక్ష్మీనారాయణ (విశాఖ),బి.నాగ గంగాధర్ (చోడవరం), పి.శ్రీనివాసరావు (విశాఖ) ఎం.రవికుమార్ (విశాఖ), బి.శ్రీనివాసరావు(అనకాపల్లి ),వి.హరికృష్ణ (అనకాపల్లి) ఉన్నారు.
Similar News
News November 15, 2024
ఏయూ: ఎం.ఫార్మసీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎం.ఫార్మసీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షలు భాగం అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేసి ఏయూ వెబ్ సైట్లో ఉంచారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 14, 2024
ఏయూ: రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
ఎంటెక్, ఎంప్లానింగ్ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసి వెబ్ సైట్లో పొందుపరిచినట్లు పరీక్షలు విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ నెలలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. విద్యార్థులు ఏయూ వెబ్ సైట్ నుంచి తమ రిజిస్ట్రేషన్ (హాల్ టికెట్) నెంబర్ ఉపయోగించి పరీక్షా ఫలితాలను పొందవచ్చును.
News November 14, 2024
టాస్క్‌ఫోర్స్ కమిటీలో కేకే రాజు, భాగ్యలక్ష్మికి చోటు
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా రాష్ట్రం అంతటా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా విశాఖ జిల్లాకు భాగ్యలక్ష్మి, కెకె రాజులను టాస్క్‌ఫోర్స్ కమిటీగా నిర్ణయించింది. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వీరు పని చేస్తారు. జిల్లాల్లో పార్టీ నేతలు, లీగల్‌సెల్ ప్రతినిధుల సమన్వయంతో టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుంది.