News January 22, 2025
ఉమ్మడి విశాఖలో 29 మద్యం షాపులు కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 28 మద్యం దుకాణాలను కేటాయించింది. అనకాపల్లి జిల్లాలో గౌడ శెట్టిబలిజ యాత కులస్తులకు మొత్తం 15 దుకాణాలను కేటాయించింది. విశాఖ జిల్లాలో 14 దుకాణాలను కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఒక్క దుకాణం కూడా కేటాయించలేదు.
Similar News
News January 22, 2025
అల్లూరి: బడి కోసం ఊరంతా ఏకమైంది..!
చింతపల్లి మండలం బలపం పంచాయతీ వీరవరంలో పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో పాఠశాల భవనం లేక బడి ఈడు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామస్థులంతా ఏకమై శ్రమదానంతో రేకుల షెడ్డు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖా మంత్రి లోకేశ్, అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని కోరారు.
News January 22, 2025
అగనంపూడి వద్ద యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
అగనంపూడి టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం గాజువాక నుంచి అగనంపూడి వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు లారీ వెనుక చక్రాల కింద పడి స్పాట్‌లోనే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక మహిళ, మరో పురుషుడు ఉన్నారు. మృతి చెందిన మహిళ వద్ద ఉన్న ఆధార్ కార్డు, బ్యాంకు బుక్ ప్రకారం పాత గాజువాకకు చెందిన గొర్లె అరుణ్ కుమారిగా పోలీసులు గుర్తించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 22, 2025
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ పి రఘువర్మ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగుస్తుంది. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయింది. 123 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 19 వేల ఓటర్లు ఉన్నారు.