News June 14, 2024
ఉమ్మడి విశాఖలో మొదటి హోంమంత్రి
ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మొదటి హోంమంత్రిగా అనిత రికార్డు సృష్టించారు. 62 ఏళ్ల తర్వాత పాయకరావుపేట నియోజకవర్గానికి మంత్రి పదవి వరించింది. మొదటి సారి కేబినెట్లో చోటు సంపాదించుకున్న అనితకు చంద్రబాబు హోంశాఖను అప్పజెప్పి రాష్ట్ర శాంతిభద్రతలు ఆమె చేతిలో పెట్టారు. వృత్తి పరంగా టీచర్ కావడం ప్లస్ పాయింట్. ప్రతి విషయంపై సమగ్రమైన అవగాహన ఉండటం, వాగ్ధాటి, సూటిగా మాట్లాడేతత్వం ఆమెకు కలిసొచ్చే అంశాలు.
Similar News
News January 16, 2025
విశాఖలో అనిల్ అంబానీ భారీ పెట్టుబడి!
విశాఖ జిల్లాకు మరో భారీ పెట్టుబడి రానుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ విశాఖలో 1500 ఎకరాల పరిధిలో సోలార్ ప్లేట్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే జిల్లాలో అనువైన భూములను పరిశీలించినట్లు సమాచారం. త్వరలోనే ఒక ప్లేస్‌ను ఫైనల్ చేసి పనులు ప్రారంభించనున్నారు. కాగా ఇప్పటికే అనీల్ అంబానీ అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో భూములను పరిశీలించిన సంగతి తెలిసిందే.
News January 16, 2025
రేవుపోలవరం సముద్రంలో మునిగి బాలుడి మృతి
రేవు పోలవరం సముద్ర తీరంలో బుధవారం కనుమ పండుగ రోజున బాలుడు సముద్రంలో మునిగి మృతి చెందగా మరో యువకుడు గల్లంతయ్యాడు. కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన పలువురు రేపు పోలవరం సముద్ర తీరానికి వచ్చారు. వీరిలో సాత్విక్ (10) సముద్రంలోకి దిగి మునిగిపోయాడు. బాలుడిని తీసుకువచ్చేందుకు దిగిన కాకర్ల మణికంఠ (22) గల్లంతయ్యాడు. ఒడ్డుకు కొట్టుకు వచ్చిన సాత్విక్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News January 16, 2025
గాజువాకలో దారుణం.. చిన్నారి మృతి
గాజువాకలోని పండగ వేళ ఓఅపార్ట్మెంట్ వద్ద సెల్లార్లో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కారు ఢీకొంది. తీవ్రగాయాలతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సుజాతనగర్ ప్రాంతానికి చెందిన భోగిర్ల లారీణి తన తల్లిదండ్రులతో సెల్స్ట్ అపార్ట్మెంట్లోని బంధువుల ఇంటికి వచ్చారు. చిన్నారి ఆడుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పండగ వేళ ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.