News April 19, 2025
ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

సబ్బవరం మండలం గణపతి నగర్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థి కె.అప్పలనాయుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి ఇంటికి వచ్చి గదిలోకి వెళ్లాడు. గంట తర్వాత స్నేహితుడు సుబ్రహ్మణ్యంకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. స్నేహితుడు గణపతి నగర్‌కు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. తల్లి లీలా కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
Similar News
News April 20, 2025
కార్పొరేటర్లను ప్రలోభపెట్టినట్టు నిరూపించాలి: V.M.R.D.A ఛైర్మన్

G.V.M.C.ఎన్నికల్లో కార్పొరేటర్లను ప్రలోభపెట్టినట్టు ఆరోపిస్తున్న వైసీపీ నాయకులు దాన్ని నిరూపించాలని V.M.R.D.A ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ సవాల్ చేశారు. అవిశ్వాసంలో ధర్మబద్ధంగా నెగ్గామన్నారు. గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు చేయని అరాచకం లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఇకపై జీవీఎంసీని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామన్నారు.
News April 20, 2025
DSC: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ 10 గంటలకు మెగా DSC నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ➱SA LANG-1: 26, ➱HINDI: 28, ➱ENG: 55, ➱MATHS: 59, ➱PS: 39, ➱BS: 58, ➱SOCIAL: 91, ➱PE:139, ➱SGT: 239, ➱TOTAL: 734 ఉన్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ➱TEL: 07, ➱HINDI: 11, ➱MATHS:07, ➱PS: 35, ➱SOCIAL:05, ➱SGT: 335, ➱TOTAL:400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
News April 20, 2025
అవిశ్వాసంతో పదవి కోల్పోయిన విశాఖ తొలి మేయర్

అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన మొదటి మేయర్‌గా హరివెంకట కుమారి నిలిచారు. విశాఖ మున్సిపాలిటీ 1979లో కార్పొరేషన్‌గా మారింది. 1981లో జరిగిన ఎన్నికల్లో మొదటి మేయర్‌గా N.S.N.రెడ్డి(1981-1986) గెలిచారు. అనంతరం 1987లో D.V సుబ్బారావు, 1995లో సబ్బం హరి, 2005లో రాజాన రమణి మేయర్లుగా పనిచేశారు. 2005లో G.V.M.C ఆవిర్భవించినాక 2007లో మేయర్‌గా జనార్దనరావు ఎన్నికయ్యారు. 2021లో హరివెంకట కుమారి పదవి చేపట్టారు.