News March 29, 2025

ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే: కర్నూలు ఎంపీ

image

తన లాంటి సామాన్యుడిని ఎంపీని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. శనివారం కర్నూలులో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఊపిరి ఉన్నంత వరకు తాను టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. టీడీపీ పేదల పార్టీ అని తెలిపారు.

Similar News

News April 3, 2025

కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం

image

కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్‌ కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. కర్నూలులోని జీఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వివాహా వేడుకలో నూతన వధూవరులు శ్రేయ, వివేకానంద విరూపాక్షలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ వేడుకలో జిల్లా వైసీపీ నేతలు పాల్గొన్నారు.

News April 3, 2025

నేడు కర్నూలుకు వైఎస్‌ జగన్‌

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నేడు కర్నూలుకు రానున్నారు. ఉ.9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.30 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం నగర శివారులోని జీఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో వైసీపీ నేత కోట్ల హర్షవర్దన్‌ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. మ.12.50 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు.

News April 3, 2025

సుంకేసుల డ్యామ్‌ ఘటన.. మృతులు వీరే!

image

కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్‌ వద్ద నిన్న విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన సులేమాన్‌ (47) తన కుమార్తెకు పదో తరగతి పరీక్షలు ముగియడంతో కుటుంబ సభ్యులతో కలిసి డ్యామ్ వద్దకు వెళ్లారు. తన కుమారులు ఫర్హాన్‌ (13), ఫైజాన్‌ (9)తో కలిసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. కాసేపటి తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి. ఘటనపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!