News April 14, 2025
ఎండపల్లి: అంబేడ్కర్ వేషధారణలో బాలుడు

ఎండపల్లి మండల కేంద్రంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుడు తునికి శ్రీ కీర్తన్ అంబేడ్కర్ వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడకి అంబేడ్కర్ గొప్పదనం గురించి తమ గురువులు చెప్పారని అన్నారు. అంబేడ్కర్ అంటే తనకు ఇష్టమని తెలిపారు.
Similar News
News April 19, 2025
TODAY HEADLINES

✒ UPI పేమెంట్స్‌పై 18% GST వార్తలు ఫేక్: కేంద్రం
✒ త్వరలో ISSకు భారత వ్యోమగామి శుభాంశు
✒ AP: ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు విడుదల
✒ బెట్టింగ్ వ్యతిరేక విధానం తెస్తాం: లోకేశ్
✒ APకి రూ.28,842 కోట్ల మద్యం ఆదాయం
✒ TTD ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలి: సుబ్రహ్మణ్యస్వామి
✒ TGలో NTT డేటా సంస్థ రూ.10,500కోట్ల పెట్టుబడి
✒ రేవంత్.. మీ బాస్‌ల కేసుపై మౌనమెందుకు?: KTR
✒ నేషనల్ హెరాల్డ్ కేసుతో BJPకి సంబంధం లేదు: బండి
News April 19, 2025
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

ఛానల్ అప్డేట్స్, మెసేజ్‌లను ఇతర భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకోగలిగే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. లేటెస్ట్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకుని ట్రాన్స్‌లేషన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాక్టివేట్ చేసుకోవాలి. హిందీ సహా స్పానిష్, రష్యన్, అరబిక్ తదితర విదేశీ భాషలు సైతం అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో రోల్ ఔట్ కానుంది.
News April 19, 2025
శ్రీనగర్ ASPగా కర్నూల్ వాసి.!

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ ASPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ ASPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.