News April 24, 2025
ఎండల వేళ.. జాగ్రత్త!

కొన్నిరోజులగా నంద్యాల జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. 40 నుంచి 44 °C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నీటిని బాగా తాగడంతోపాటు చలువ కోసం కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు.
Similar News
News April 24, 2025
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై రాజధాని, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. మే 2న అమరావతి పర్యటనకు రావాలని ఆయనను ఆహ్వానిస్తారని సమాచారం.
News April 24, 2025
జగిత్యాల : మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు: జీవన్‌రెడ్డి

JGTL ఇందిరాభవన్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మామిడి రైతులు మార్కెట్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రేడర్లు నిబంధనలు పాటించక, మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపంతో రైతులపై భారం పడుతుందని తెలిపారు. కమీషన్ల దోపిడీ, నాణ్యత, గ్రేడింగ్ పేరుతో నష్టం, మౌలిక వసతుల లోపం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
News April 24, 2025
మల్యాలలో భూభారతి అవగాహన సదస్సు

మల్యాల మండలం ముత్యంపేట గ్రామం రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఈరోజు భూభారతి పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.