News April 7, 2025
ఎండలతో జాగ్రత్త!

కర్నూలు జిల్లాలో నేటి నుంచి క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41-43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా నిన్న జిల్లాలోని కామవరంలో అత్యధికంగా 40.8°C ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News April 16, 2025
KNL: నేమకల్లు పశువైద్య అధికారి నియామకం

చిప్పగిరి మండలంలోని నేమకల్లు గ్రామ పశువైద్య అధికారిగా కమలమ్మ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన మహేశ్ ఇతర విధుల బాధ్యతల కారణంగా వెళ్లడంతో ఆమె ఈ విధుల్లో చేరారు. ఆమె మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరిస్తామన్నారు. పశువులకు వచ్చే రోగాలకు వెంటనే టీకాలు వేయించుకోలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పశు వైద్యశాలకు వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
News April 16, 2025
ఈకేవైసీ ప్రక్రియకు ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు

కర్నూలు జిల్లాలో 21,92,047 రేషన్ కార్డులలో 19,56,828 యూనిట్లకు ఈకేవైసీ పూర్తి కాగా, 1,82,991 యూనిట్లకు ఇంకా పూర్తి చేయాల్సి ఉందని జేసీ నవ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈకేవైసీ పూర్తి కాని వ్యక్తుల పేర్లు ఈపీఓఎస్ మెషిన్లో రెడ్ మార్కుతో చూపిస్తుందన్నారు. ఏప్రిల్ 30 లోపు ఎన్ఎఫ్ఎస్ఓ కార్డుదారులు దేశవ్యాప్తంగా, ఎన్‌ఎన్ఎఫ్ఎస్ఓ కార్డు దారులు రాష్ట్రంలో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.
News April 15, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు.!

➤ ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 240 పోస్టులు.!
➤కర్నూలులో మెరుగైన వైద్యం: మంత్రి భరత్
➤ కొలిమిగుండ్ల: ఉద్యోగం రాక యువకుడి ఆత్మహత్య
➤ ఆళ్లగడ్డలో టీడీపీ నేతపై దుండగుల దాడి
➤ మహానందిలో మిస్టరీగానే వ్యక్తి మరణం
➤ దేవనకొండ: హార్ట్ స్ట్రోక్‌తో యువకుడి మృతి
NOTE: ‘‘పైన టూల్ బార్‌లో లొకేషన్ మీద, తర్వాత ‘V’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.