News March 26, 2025
ఎచ్చెర్ల: బడివానిపేట వీఆర్వో ఆకస్మిక మృతి

ఎచ్చెర్ల తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బడివానిపేట వీఆర్వో రాజారావు కార్యాలయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. బుధవారం ఉదయం కార్యాలయానికి ఆయన వచ్చారు. సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. తక్షణం సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News April 1, 2025
శ్రీకాకుళం: డీఈవోపై మంత్రి అచ్చెన్నకు ఫిర్యాదు

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సోమవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డీఈవో తిరుమల చైతన్యపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెనాయుడుకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల విద్యాశాఖలో జరిగిన పరిణామాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వివరించగా ఆయన వెంటనే స్పందించి కమిషనర్ విజయరామరాజుకు ఫోన్లో మాట్లాడి సమస్యను సద్దుమణిగినట్లు చూడాలని తెలిపారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.
News March 31, 2025
లావేరు: జిరాక్స్ షాప్ యజమానికి రూ.36 లక్షల పన్ను నోటీసు

లావేరు(M) భరణికానికి చెందిన జిరాక్స్ షాపు యజమాని ఏ.హరికృష్ణకు ఒంగోలుకు సంబంధించిన GST డిప్యూటీ సహ కమిషనర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. రూ.36,13,000 పన్ను బకాయి ఉన్నట్లుగా నోటీసులో ఉండటంతో అతను కంగుతిన్నాడు. తాను ఒంగోల్లో ఏ వ్యాపారం చేయలేదని, గతంలో బార్‌లో పని చేశానని పేర్కొన్నారు. అయితే ఒంగోల్లో హరికృష్ణ పేరు మీద హనుమాన్ ట్రేడర్స్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు.
News March 31, 2025
రణస్థలం: అనుమానాస్పద స్థితిలో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

రణస్థలంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న పిన్నింటి అప్పలసూరి ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పరిశ్రమలో ఉన్న వాష్ రూమ్‌లో ఉరివేసుకొని మృతి చెందినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. మృతునిది నరసన్నపేట మండలం లుకలాం గ్రామం అని తెలిసింది. అయితే అప్పలసూరి మృతి పట్ల బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.