News March 23, 2025
ఎచ్చెర్ల రోడ్డు ప్రమాదంలో టెక్నీషియన్ మృతి

ఎచ్చెర్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన దేశరాజ వెంకట కిరణ్ కుమార్(40) ఆదివారం ఎచ్చెర్ల కేశవరెడ్డి స్కూల్ వద్ద జంక్షన్ దాటుతుండగా రాజాం నుంచి వస్తున్న క్యాబ్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎచ్చెర్లలో రూమ్ తీసుకొని రణస్థలం ప్రభుత్వాసుపత్రి CHCలో టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
Similar News
News March 26, 2025
శ్రీకాకుళం: ‘కెమికల్ ఇంజనీర్లకు విపరీతమైన గిరాకీ’

శ్రీకాకుళం జిల్లాలో కెమికల్ ఇంజినీర్లకు విపరీతమైన డిమాండు ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఫార్మా రంగంలో జిల్లా వేగంగా అభివృద్ది చెందుతోందని చెప్పారు. అమరావతిలో బుధవారం సీఎం సమక్షంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన తన జిల్లా ప్రగతి గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో ఫార్మా సంస్థల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్నారు.
News March 26, 2025
శ్రీకాకుళం: ఈ మండలాల ప్రజలకు అలెర్ట్

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఆమదాలవలస-38.1 ఉష్ణోగ్రత, బూర్జ-39, హిరమండలం-39.2, ఇచ్ఛాపురం-37.5, జలుమూరు-38-2, కంచిలి-37.4, కోటబొమ్మాళి-37.5, కొత్తూరు-39.7, ఎల్‌ఎన్ పేట-39 నరసన్నపేట-37.4, పాతపట్నం-38.9, పొందూరు-37.7, సారవకోట-38.4, సరుబుజ్జిలి-38.5, టెక్కలి-37.6 మండలాలకు అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంది.
News March 26, 2025
సీఎం రివ్యూ మీటింగ్‌లో శ్రీకాకుళం కలెక్టర్, ఎస్పీ

అమరావతిలో మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన అంశాలపై నివేదికలు సమర్పించారు. అలాగే జిల్లాకు అవసరమైన అభివృద్ధి పథకాల గురించి వివరించారు.