News March 19, 2025
ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 19, 2025
IPL అభిమానులకు పోలీసుల సూచన!

ఉప్పల్ స్టేడియంలో ఆదివారం నుంచి IPL మ్యాచులు జరగనున్నాయి. ఈక్రమంలో స్టేడియంలోకి తేకూడని వస్తువులను పోలీసులు సూచించారు. ‘కెమెరాలు& రికార్డింగ్ పరికరాలు, బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ & ఎయిర్‌పాడ్స్, సిగరెట్, అగ్గిపెట్టె, కత్తులు, గన్స్, వాటర్ & ఆల్కహాల్ బాటిల్స్, పెట్స్, తినుబండారాలు, బ్యాగ్స్, ల్యాప్‌టాప్స్, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్, బైనాక్యులర్, టపాసులు, డ్రగ్స్’ వంటివి తీసుకురాకూడదని పోలీసులు తెలిపారు.
News March 19, 2025
పశువుల షెడ్డులో 12 అడుగుల గిరినాగు..!

మాడుగులలో బుధవారం 12 అడుగుల భయంకరమైన గిరినాగు హల్ చల్ చేసింది. మాడుగుల మోదమాంబ కాలనీలో కనక అనే మహిళ ఈ గిరినాగును తన పశువుల షెడ్డులో చూసి భయాందోళన చెంది కుమారుడు గణేశ్‌కు విషయం చెప్పింది. దీంతో గణేశ్ స్నేక్ క్యాచర్ వెంకటేశ్‌కు సమాచారం ఇవ్వడంతో చాకచక్యంగా ఈ గిరి నాగును బంధించారు. ఈ గిరినాగును వంట్లమామిడి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని స్నేక్ క్యాచర్ వెంకటేశ్ తెలిపారు.
News March 19, 2025
HYDలో అచ్చంపేట యువకుడి ఆత్మహత్య

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చేదురుబావి తండాకు చెందిన మూడవత్ బాలు నాయక్ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. బతుకుదెరువు కోసం కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడన్నారు. ఆర్థిక ఇబ్బందులు, దానికి తోడు కుటుంబ కలహాలతో బాలు నాయక్ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.