News February 1, 2025

ఎన్టీఆర్: 67.38% మేర జరిగిన పింఛన్ల పంపిణీ

image

ఎన్టీఆర్ జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ శనివారం ఉదయం 10 గంటల వరకు 67.38% మేర పంపిణీ అయ్యింది. జిల్లాలో 2,29,914 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా 1,54,926 మందికి ప్రభుత్వ యంత్రాంగం పింఛన్ అందజేసింది. కాగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పింఛన్ పంపిణీ ప్రక్రియకు రాజకీయ పక్షాల నేతలు దూరంగా ఉన్నారు. 

Similar News

News February 1, 2025

అనకాపల్లి: ఎన్నికలు ముగిసేవరకు పరిష్కార వేదిక నిలుపుదల

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిలుపు చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. మార్చి 8వ తేదీతో ఎన్నికల కోడ్ ముగుస్తుందన్నారు. ఆ తర్వాత నుంచి ప్రజావేదిక కొనసాగిస్తామని ప్రజలు గమనించాలని కోరారు.

News February 1, 2025

తర్వాతి మ్యాచ్‌లో షమీని ఆడిస్తాం: మోర్కెల్

image

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా రేపు జరిగే ఆఖరి మ్యాచ్‌లో షమీని ఆడించనున్నట్లు భారత బౌలింగ్ కోచ్ మోర్కెల్ తెలిపారు. ‘షమీ చాలా బాగా ఆడుతున్నారు. వార్మప్ గేమ్స్‌లో శరవేగంగా బౌలింగ్ చేస్తున్నారు. వచ్చే మ్యాచ్‌కి ఆయన్ను ఆడిస్తాం. ఆ అనుభవం యువ ఆటగాళ్లకు కీలకం’ అని పేర్కొన్నారు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ షమీకి భారత జట్టులో వరుస అవకాశాలివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

News February 1, 2025

బడ్జెట్‌లో తెలంగాణ ప్రయోజనాలకు విలువ లేదా..?: హరీశ్ రావు

image

2025-26 బడ్జెట్‌ను కేంద్రం తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకున్నదే తప్ప దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదని హరీష్ రావు ‘X’లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పదేపదే వల్లే వేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా..? అని ప్రశ్నించారు. ఎన్నికలున్న రాష్ట్రాలకు వరాలు ప్రకటించి లేని రాష్ట్రాలకు వివక్ష చూపడం సరికాదన్నారు. బడ్జెట్లో తెలంగాణ ప్రయోజనాలకు విలువ లేదా..? అని నిలదీశారు.