News April 13, 2025

ఎన్టీఆర్: అమరావతి శంకుస్థాపనకు చురుకుగా ఏర్పాటు

image

ఈనెల 24-26 తేదీల మధ్య రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలను సమీకరణ చేయనున్నారు. సుమారు 5 నుంచి 5 లక్షల మధ్య ప్రజలు రానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు సిద్ధం చేస్తున్నారు. అతిథుల కోసం 4 హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

Similar News

News April 15, 2025

వచ్చే నెలలో జనంలోకి సీఎం

image

TG: మే నెలలో జనంలోకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించారు. త్వరలోనే ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్లు ఇస్తానన్నారు. రెండో సారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారానికి దిగాయన్నారు.

News April 15, 2025

మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ

image

MBNR జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.

News April 15, 2025

కాకినాడ: జిల్లాకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ

image

మారిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. తుని, పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ రూరల్ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు, ప్రయాణికులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలకు పంపించిన చరవాణి హెచ్చరికల్లో పేర్కొంది.

error: Content is protected !!