News March 18, 2025

ఎన్టీఆర్: అమరావతిలో నిర్మాణ పనులకు క్యాబినెట్‌ ఆమోదం

image

సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి పలు అంశాలకు ఆమోదం లభించింది. సీఆర్డిఏ ఆధ్వర్యంలో జరిగే 22 పనులకు L1 బిడ్డర్లను అనుమతించేందుకు, ఏడీసీఎల్ ఆధ్వర్యంలో జరిగే రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనులకు పరిపాలనా అనుమతులకు క్యాబినెట్ ఓకే చెప్పింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ పనులకు సంబంధించి కరెన్సీ సీలింగ్ క్లాజ్ అగ్రిమెంట్‌‌లో సవరణను ఆమోదించింది.

Similar News

News March 19, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 19, 2025

 HNK: విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 19న బహిరంగ విచారణ

image

విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 19న బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు టిజి ఎన్.పి.డీ.సి.ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో జరిగే ఈ బహిరంగ విచారణలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సవరణ చేయబడిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడి సర్ఛార్జ్‌ల ప్రతిపాదనలపై విచారణ జరుగుతుందన్నారు.

News March 19, 2025

వారానికి రెండుసార్లు ఫిజియోథెరపీ సేవలు: మహబూబ్‌నగర్ కలెక్టర్

image

ఇక నుంచి దివ్యాంగుల కోసం వారానికి రెండు సార్లు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ సేవలను అందిస్తామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష సమావేశం 183 మందికి దివ్యాంగులకు రూ.16 లక్షల విలువైన సహాయ పరికరాలను ఉచితంగా అందజేశారు. అంగ వైకల్యం కలిగిన ఎంతోమంది తమ వైకల్యాన్ని జయించి జీవితంలో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారని కలెక్టర్ గుర్తు చేశారు.

error: Content is protected !!