News March 17, 2025
ఎన్టీఆర్: ఈ మండలాల ప్రజలు కాస్త జాగ్రత్త

జిల్లాలో రేపు సోమవారం 8 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయవాడ అర్బన్ 40.5, రూరల్ 40.4, వీరుల్లపాడు 40.8, నందిగామ 40.9, జి.కొండూరు 40.4, చందర్లపాడు 41, ఇబ్రహీంపట్నం 40.7, కంచికచర్ల 40.9 డీగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది.
Similar News
News March 17, 2025
గద్వాల: ప్రజావాణికి 30 ఫిర్యాదులు

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయములోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది తమ సమస్యల పరిష్కరం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.
News March 17, 2025
కృష్ణా: ‘టెన్త్ పరీక్షలకు యూనిఫామ్ అనుమతి లేదు’

పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ అనుమతి లేదని (గవర్నమెంట్ ఎగ్జామ్స్) అసిస్టెంట్ కమిషనర్ ఎమ్ డేవిడ్ రాజు తెలిపారు. సోమవారం స్వతంత్ర పురం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఘటనపై యూనిఫామ్ అనుమతి ఉందా, లేదా అన్న విషయంపై (ఎమ్ డేవిడ్ రాజును పాత్రికేయులు వివరణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్షా సమయంలో యూనిఫామ్ అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు.
News March 17, 2025
సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన క్రైమ్స్ డీసీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన క్రైమ్స్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన బి.జనార్దన్ సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలుసి మొక్కను అందజేశారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీల నియంత్రణకై తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలు, అలాగే పెండింగ్ ఉన్న చోరీ కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు నిందితులను పట్టుకోవడం కోసం పోలీస్ కమిషనర్ క్రైమ్ డీసీపీ పలు సూచనలు చేశారు.