News March 31, 2024

ఎన్టీఆర్ జిల్లాలో రూ.16.10లక్షల నగదు, బంగారం పట్టివేత

image

ఎన్నికలో నేపథ్యంలో జిల్లా కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. CP కాంతిరాణా టాటా మాట్లాడుతూ.. పశ్చిమ DCP పరిధిలో ప్రకాశం బ్యారేజ్, గుంటుపల్లి, పాముల కాలువ, నున్న పవర్ గ్రిడ్ ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో రూ.5.55లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 1టౌన్ స్టేషన్ పరిధిలో రూ.10.55లక్షల నగదు, 79.1గ్రాముల గోల్డ్ పట్టుకుని ఎన్నికల అధికారులకు అందిచామన్నారు.

Similar News

News December 29, 2024

కొడాలి నానికి కూడా స్కాంలో భాగం ఉందా?: కొల్లు రవీంద్ర

image

మచిలీపట్నం: పేర్ని జయసుధ బఫర్ గిడ్డంగిలో జరిగిన స్కాంలో పేర్ని నాని స్నేహితుడు కొడాలి నాని నోరు మెదపడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఈ స్కాంలో ఆయనకూ భాగస్వామ్యం ఉందా? అని Xలో ప్రశ్నించారు. గతంలో తరచూ ప్రెస్‌మీట్‌లు పెట్టే పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి నాని, ఇప్పుడు పేర్ని నానిని సమర్థించడం లేదే? అని అన్నారు. కొడాలి నాని పాత్ర ఉందా? లేదా? అనే విచారణలో తేలాల్సి ఉందని పేర్కొన్నారు.

News December 29, 2024

విజయవాడ: నేడు రామ్‌చరణ్‌ భారీ కటౌట్‌ ఆవిష్కరణ

image

విజయవాడ వజ్రా గ్రౌండ్స్‌లో ఈరోజు గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్‌ కటౌట్‌ను ఆవిష్కరించబోతుంది. వేడుకల్లో భాగంగా హెలికాప్టర్‌తో రామ్ చరణ్ కటౌట్‌కి పూలాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ ఛేంజర్ చిత్ర బృందం హాజరుకానుంది. అలాగే రామ్ చరణ్ అభిమానులు భారీగా తరలి రానున్నారు. కాగా సుమారు 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్‌ సినిమాలో రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు.

News December 29, 2024

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

image

కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గుంటూరు, గయ(బీహార్) మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07719 గుంటూరు- గయ రైలును జనవరి 25న, నం.07720 గయ- గుంటూరు రైలును జనవరి 27న నడుపుతున్నామని తెలిపింది. నం.07719 రైలు 25న మధ్యాహ్నం 3.30కి విజయవాడ చేరుకుంటుందని, నం.07720 రైలు గయలో 27న బయలుదేరి 29న ఉదయం 1.30కి విజయవాడ వస్తుందన్నారు.