News March 27, 2025
ఎన్టీఆర్: పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్(Y20- 23 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను మే 16 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 2లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News April 2, 2025
కర్నూలు: TODAY TOP NEWS

➤ రేపు కర్నూలుకు YS జగన్ రాక➤ కర్నూలు- విజయవాడ విమాన సర్వీసులపై చర్చించిన మంత్రి టీజీ➤ బీటీ నాయుడు ప్రమాణ స్వీకారానికి మంత్రాలయం నేతలు➤ ఎమ్మిగనూరు గాంధీ నగర్‌లో పట్టపగలే చైన్ స్నాచింగ్ కలకలం➤ కర్నూలు జిల్లాకు వర్ష సూచన➤ కర్నూలు: నకిలీ డాక్యుమెంట్లతో కోట్లు స్వాహా➤ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లాలో నిరసనలు➤ నంది అవార్డు గ్రహీతకు ఆదోని DSP అభినందన ➤గోనెగండ్లలో పర్యటించిన సబ్ కలెక్టర్
News April 2, 2025
అందుకే గోవాకు మారుతున్నా: జైస్వాల్

తాను ముంబై టీమ్ నుంచి <<15967764>>గోవా జట్టుకు మారడంపై<<>> యశస్వీ జైస్వాల్ స్పష్టతనిచ్చారు. గోవా క్రికెట్ అసోసియేషన్ తనకు లీడర్‌షిప్ రోల్ ఆఫర్ చేసిందని, అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నట్లు తెలిపారు. ఇది చాలా కష్టతరమైన నిర్ణయమని, తన ఎదుగుదలకు కారణమైన ముంబై సిటీ, MCAకి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. టీమ్ ఇండియా తరఫున రాణించడం, గోవా జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని వెల్లడించారు.
News April 2, 2025
విశాఖ మీదుగా బయలుదేరే రైళ్లకు అదనపు బోగీలు

విశాఖ మీదుగా బయలుదేరే రైళ్లకు అదనపు బోగీలు వేయనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ -బరాంపూర్ ఎక్స్ ప్రెస్ (18526/25)కు ఏప్రిల్ 1నుంచి ఏప్రిల్ 30 వరకు 2 జనరల్ కోచ్, విశాఖ-రాయ్‌పూర్ (58528/27)కు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30వరకు ఒక జనరల్ కోచ్, విశాఖ- కొరాపుట్(58538/37) ఒక జనరల్ కోచ్, విశాఖ-భవానీపట్నం పాసంజర్‌కు (58504/03)ఒక జనరల్ కోచ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.