News March 9, 2025
ఎన్టీఆర్: బీ. ఫార్మసీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలోని కళాశాలల్లో బీ. ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 3,5వ సెమిస్టర్ (రెగ్యులర్) థియరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 11లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 3వ సెమిస్టర్ ఈనెల 26 నుంచి, 5వ సెమిస్టర్ ఈనెల 25 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని, వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU వర్గాలు తెలిపాయి.
Similar News
News December 17, 2025
ఇతిహాసాలు క్విజ్ – 99 సమాధానం

ఈరోజు ప్రశ్న: హిందూ పురాణాల ప్రకారం.. ఈ మాసంలో సూర్య కిరణాలు ప్రత్యేక తేజస్సుతో ఉండి, అశుభాలను తొలగిస్తాయని నమ్ముతారు. అలాగే, ఈ మాసం శని దేవుని జన్మ నక్షత్రంగా పరిగణిస్తారు. ఇంతకీ అది ఏ మాసం?
సమాధానం: పుష్య మాసం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 17, 2025
ఇంట్లో నుంచే సంపాదిద్దాం..

చాలామంది అమ్మాయిలకు పెళ్లైన తర్వాత కెరీర్ ఆశలకు, ఆశయాలకూ అడ్డుకట్ట పడిపోతుంది. ఇలాంటి వారు ఇంట్లో ఉండే ఆర్థిక స్వేచ్ఛను సాధించొచ్చంటున్నారు నిపుణులు. అందమైన హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ చేయడం వస్తే దాన్నే ఉపాధిగా మార్చుకోవచ్చు. ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయగలిగే సత్తా ఉన్నవాళ్లు పార్టీ ఆర్గనైజర్‌గా మారొచ్చు. కావాల్సిన వాళ్లకి బాల్కనీల్లోనే గార్డెనింగ్ ఏర్పాటు చేసివ్వడం కూడా మంచి ఉపాధి అవకాశం అవుతుంది.
News December 17, 2025
ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి

ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్ అధికారులకు సూచించారు. బుధవారం నిజాంపట్నం మండలం, దిండి పంచాయతీలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ భూ లెవెల్ పనులను ఆయన పరిశీలించారు. KWD ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పంతాని మురళీధర్ రావుతో కలిసి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి సత్య ప్రసాద్ చొరవతో పనులు వేగవంతం చేస్తామన్నారు.


